Home  »  TV News  »  ఫైమా లేకుంటే జబర్ధస్త్ నథింగ్ అంట!

Updated : Apr 30, 2023

ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్. ఈ షో  ఎందరికో లైఫ్ ఇచ్చింది. ఈ షోలో కామెడీ చేసి సినిమాల్లో నటిస్తున్నవాళ్ళు చాలా మందే ఉన్నారు. ఈ షోలో చేసిన సుడిగాలి సుధీర్, వేణు , గెటప్ శ్రీను, రాం ప్రసాద్,  రాకెట్ రాఘవ, చంటి, ఆర్పీ, అప్పారావు, శేషు ‌ఇలా చాలామంది తెరమీద కనిపించిన వాళ్ళే. అలా జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో ఫైమా ఒకరు.

పటాస్ ఫైమా.. ఒక మారుమూల గ్రామంలోని నిరుపేద కుటుంబంలో పుట్టింది. అయితే ఇప్పుడు ఫైమా ఒక సెలబ్రిటీ అయిపోయింది. తను కాలేజీ చదివేటప్పుడు పటాస్ షోకి ఒక స్టూడెంట్ లాగా వచ్చింది. ఆ షోకి యాంకర్ గా చేస్తున్న రవి, శ్రీముఖి లకి వరుసగా.. పంచ్ లు వేస్తూ.. కామెడీ పండించింది. అది చూసిన షో మేనేజ్‌మెంట్ ఫైమాకి పటాస్ లో ఛాన్స్ ఇచ్చారు. దాంతో ఇచ్చిన ఛాన్స్ ని చక్కగా వాడుకుంది ఫైమా. అదే జబర్దస్త్ లోకి రావడానికి కారణమయింది. అయితే జబర్దస్త్ లో ఫైమా.. తన స్కిట్స్ తో మంచి పేరు తెచ్చుకుంది.  జబర్దస్త్ షో వల్ల మంచి ఫేమ్ వచ్చి.. బిగ్ బాస్-6 లో ఛాన్స్ కొట్టేసింది. హౌస్ లో కూడా స్పాంటేనియస్ కామెడీతో వినోదాన్ని పంచింది. దీంతో తన క్రేజ్ బాగా పెరిగింది. ఫైమా బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక.. షోస్, ఈవెంట్స్ తో బిజీ అయిపోయింది. అంతేకాకుండా బిబి జోడీలో ఆర్జే సూర్యతో జతకట్టి టైటిల్ విన్నర్ కూడా అయింది.

అయితే బిగ్ బాస్ షో తర్వాత తన అభిమానులకు ఇన్ స్టాగ్రామ్ లో ప్రతీ అప్డేట్ ని షేర్ చేస్తుంది. ఇలా ఎప్పుడు తన అభిమానులకి దగ్గరగా ఉంటూ వస్తోంది ఫైమా. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ క్వశ్చన్' అంటూ అభిమానులతో ముచ్చటించింది ఫైమా. ఈ సందర్భంగా ఆమెకు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురు కాగా, వాటికి తను ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.  అలా క్వశ్చన్స్ అడిగినినవారిలో ఒక అభిమాని.. "వితౌట్ ఫైమా జబర్దస్త్ ఈజ్ నథింగ్ "అని ఫైమాని అడగ్గా.. ఈ క్వశ్చన్  ఇప్పటివరకు చాలా మంది నన్ను అడిగారు.. నేను జబర్దస్త్ లో ఒక మెంబెర్ ని మాత్రమే.. నాకంటే ముందు నుంచే సీనియర్స్ ఉన్నారు.. వాళ్ళే జబర్దస్త్ ని కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళ వల్లే నేను ఇలా ఉన్నాను. ఈ క్వశ్చన్ అడుగుతుంటే ఎలాగో ఉందని ఫైమా వివరణ ఇచ్చింది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.